నన్ను నేను నిర్మించుకొన్నాను

ఇద్దరు కూతుళ్ళు పుట్టాక నాకు పెరలాసిస్ వచ్చింది . సైన్యంలో పనిచేసే నా భర్త వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకొన్నారు . నేను ఆర్థిక భారం ఇంటికి అన్నారు బంధువులు . నా శరీరం పై ప్రశ్నలు మొదలయ్యాయి . ఇక అప్పుడు నా సంపాదన తోనే నేను బతకాలని నిర్ణయించు కొన్నాను . రెస్టారెంట్ లో పని చేశాను . కోక్ రేసింగ్ లో పాల్గొన్నాను . ఆ ఫీల్డ్ ని నా కెరీర్ గా మార్చుకున్నాను అంటారు దీపా మాలిక్  . ఈ పారా అథ్లెట్ లక్షమందికి ప్రేరణ . పద్మశ్రీ ,అర్జున్ పురస్కారాలు అందుకోనేంత వరకు ఆమె తన శారీరక సమస్య ను అధికమించి స్పోర్ట్స్ ఫీల్డ్ లో కొత్త చరిత్ర సృష్టించింది . పారా ఒలింపిక్ పథకం సాధించి భారతదేశపు మొట్టమొదటి పారా అథ్లెట్  గా నిలబడ్డారు దీపా మాలిక్ . దివ్యంగురాలైన ఆమె ఎంతో మందికి క్రీడాస్ఫూర్తి .