నా పొరపాట్లు నాకు తెలుస్తాయి

ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఫర్ ఫెక్ట్ కాదు. తప్పులు చేస్తునే ఉంటారు. మనలోని లోపాలు మనకు తెలియక పోవచ్చు. ఒక్క సారి మన కంటపడవు కూడా. నాకు నా తప్పులు తెలుసుకోవటం ఇష్టం. విమర్శలు స్వీకరించటానికి నేనెప్పుడు సిద్ధం. కానీ అదేంటో ప్రతి సారి నేను తప్పు చేసిన నాకు తెలిసిపోతుంది. నా హిట్ చిత్రాల్లో కూడా నేను చేసిన పొరపాట్లు నాకు తెలుసు. ఎవ్వరు విమర్శించకుండానే నన్ను నేను సరి దిద్దుకొగలను అంటోంది తమన్నా. నా సినిమాల విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటా. నా వల్ల సినిమాకు ఎలాంటి నష్టం రాకూడదని నా ఉద్దేశ్యం. సెట్ లోకి వెళ్ళే ముందరే అన్ని చెక్ చేసుకొవటం నాకు అలవాటు అంటోంది తమన్నా.