నా కోరిక తీరింది

నిజ జీవితంలో అస్సలు ఊహించటానికి అవకాశం లేని పనులు ఊహలు తెరమీద అయినా చేయగలగడం నాకేంతో ఆనందం ఇస్తోంది అంటోంది జాన్వీ కపూర్ . నాకు చిన్నప్పటి నుంచి ఫైలెట్ అవ్వాలని కోరిక ఉండేది . ఇప్పుడా కోరిక గుంజేన్ సక్సేనా కార్షిల్ గర్ల్ తో తీరబోతోంది . ఈ సినిమా లో నా పాత్రా కోసం యుద్ధ హెలికాఫ్టర్ నడిపాను స్వయంగా నేను నడపగలను అన్నంత శ్రద్ధతో నేర్చుకున్నాను . షూటింగ్ ఆరంభించాక తొలిసారి పైలట్ గా హెలికాఫ్టర్ ఎక్కగానే నాకు కళ్ళనీళ్ళు వచ్చేశాయి . నిజంగానే ఆనందం పట్టలేకపోయాను అంటుంది జాన్వీ కపూర్ .