లయ కారుడైన శివుడు భక్త సులభుడు. చిటికెడు విభూది సమర్పించిన కోరిన కోరికలు తీరుస్తాడంటాడు. ఈ పరమేశ్వరుడి కి ప్రపంచమంతా ఆలయాలున్నాయి. ఈయనకు తన గుడి ఫలానా రకంగా ఉండాలని నియమాలు ఏంలేవు. భక్తులు ఏ రూపంలో తనను దర్శించాలనుకొంటే ఆరూపంలో కరుణిస్తాడు.    కేరళలో పరశిన్ కాడవు ( Parassinikkadavu ) ముత్తప్పన్ ఆలయం ఉంది. ముత్తప్పన్ శివాంశతో జన్మించినవాడు. ఈ దేవుడికి వేట అంటే ఇష్టం. ముత్తప్పన్ కు తోడుగా జాగిలాలు వుంటాయట. ఈ ఆలయంలో ఎటు చుసిన శునకాలే కనిపిస్తాయి. స్వామి తొలి ప్రసాదం వాటికే నివేదిస్తారు. ఈ శివాలయం చాలా ప్రాచీనం.

Leave a comment