తల్లి పక్కనే బిడ్డ

పుట్టిన పసి బిడ్డ ఎప్పుడు తల్లి స్పర్శ తగులుతూ దగ్గరే ఉండాలంటారు డాక్టర్లు . బిడ్డ ఎప్పుడు తల్లి పక్కలోనే ఉండాలి తల్లి ఒంటి నుంచి లభించే వెచ్చదనం బిడ్డకు చాలా అవసరం ముఖ్యంగా నెలలు నిండ కుండా పుట్టిన బిడ్డకు ఇది అత్యవసరం కూడా .శిశువుల చర్మంలోంచి ఉష్ణోగ్రత త్వరగా వెళ్ళిపోతుంది . దీనితో బిడ్డ శరీరంలో ఎక్కువ శక్తి ని ఉత్పత్తి చేయవలసి వస్తుంది . ఇందుకోసం పిల్లల శరీరంలోని బ్రౌన్ ఫ్యాట్ ని ఉపయోగించు కోవటం ఆరంభిస్తుంది . ఈ కొవ్వు తగ్గితే పిల్లలు పూర్తిగా అలసిపోతారు . అందుకనే పిల్లాన్ని వెచ్చగా ఉంచటం తల్లి పక్కనే పడుకోవటం మంచిది అంటారు .