సైన్స్ అంటే అంతో అభిమానం సరితకు. మంచిర్యాల జిల్లాకు చెందిన సరిత ఉపాధ్యాయుల ప్రోత్సహంతో వాటర్ లిఫ్ట్ విత్ ఫుడ్ పవర్ అనే పరికరం కనిపెట్టింది. ఇది రైతులకు ఎంతో ఉపయోగం ఈ పరికరం హైద్రాబాద్ లో విద్య వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రశంసలు పొందింది. జాతీయ స్థాయిలో జరిగే సైన్స్ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించేందుకు ఈ పరికరం అర్హత సాధించింది. పత్తి కూలిగా పనిచేసి కుటుంబ పోషణకు సాయపడే ఈ అమ్మాయి ఈ ప్రయోగం చేయటం తో అందరి ఆశీర్వచనలు అందుకొంది. దీని సాయంతో బావిలోని నీటిని మోటారు లేకుండానే బయటకు తీయచ్చు.

Leave a comment