అమృత మధనునికి నదివో నైవేద్యము…రవి చంద్రుని నేత్రునకు కప్పురవిడెము…
షోడశ కళానిధికి షోడశోపచారము….
భక్తులు గోరంత కోరిక కోరితే కొండంత బలం,ధైర్యం, అభయం ఇచ్చి కోరికలు తీరుస్తాడు,ఆపదలు కాసేవాడు.తన శంఖం- చక్రం తో సకల లోక కళ్యాణం కోసం భక్తులకు అభయ-వరద హస్తాలతో దర్శనమిచ్చే కలియుగ దైవం.మనం శుభకార్యాలు తలపెట్టిపప్పుడు ముఖ్యంగా గోవిందుడికి ముడుపులు కడతారు, దానితో “కర్పూరం” పొట్లం కట్టి తప్పకుండా పెట్టడం స్వామి వారి కి ఎంతో ఇష్టం.
గోవింద గోవింద అని శనివారం రోజు స్మరిద్దాం. అన్ని రకాల పూలు సమ్మతమే,కదంబం, తులసి దళమాల.
నిత్య ప్రసాదం:అటుకులు,బెల్లం,పెరుగన్నం(దద్ధోజనం)
దద్ధోజనం తయారీ: ఉడికించిన అన్నం చల్లారిన తర్వాత గట్టి పెరుగు,తగినంత ఉప్పు కలిపి, ఆవాలు, ఎండు మిరపకాయలు నేతితో పోపు పెట్టుకోవాలి. వేయించిన జీడి పప్పు, కర్వేపాకు వేస్తే సరి ప్రసాదం రెడీ!!
-తోలేటి వెంకట శిరీష

Leave a comment