మా ఊరికి రండి

వైద్య సేవలు గుర్తు చేసుకొంటే ముందుగా గుర్తు వచ్చేది కేరళనే  . కరోనా సమయంలో కేరళ నుంచి వచ్చిన నర్సులు దేశం నలుమూలలా తమ  సేవలు అందించి ఎంతో  మంది రోగుల ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డుపెట్టారు . తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం 50 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు 100 మంది నర్సులు పంపమని కేరళ కు విజ్ఞప్తి చేసింది . డాక్టర్ కు నెలకు 80 వేలు స్పెషలిస్ట్ లకు రెండు లక్షలు నర్సులకు 30 వేలు ఇస్తామని ఉచిత భోజన ,బస వసతులు కల్పిస్తామని తెలిపింది .దేశంలో ఏమూల వారైనా ఆరోగ్యానికి సంబందించిన సాయం కావాలంటే కేరళ వైపే చూస్తారనేందుకు ఇది ఉదాహరణ .