ఇప్పటికీ పట్టు చీరె దగ్గర నుంచి కొన్ని వందల రకాల చీరెలు వచ్చాయి. అంచు,కొంగు,వస్త్రశ్రేణి తేడాలే తప్ప చీరెలో ఇంచు మించు ఒక రకంగానే ఉంటాయి. కానీ అదే చీరెల్ని ఇండో వెస్ట్రన్ స్టైల్ లో కట్టుకోండి ప్రత్యేకంగా ఉంటారు అంటారు ఫ్యాషన్ డిజైనర్లు. రెడ్ కార్పెట్ పైన నడచే ఇంటర్నేషనల్ మోడల్స్ సినిమా తారలు ప్రత్యేకంగా కనపబడేందుకు ఈ ఇండో వెస్ట్రన్ స్టైల్ లో చీరె కట్టుకొంటారు. ఫ్రంట్ బార్ నెక్ డిజైన్లు మార్చి చీరెలకు లేయర్స్ కుట్టించి,రెత్రో స్టైల్ బ్లౌజ్ లు ,ఫ్యాషన్ జ్యువెలరీ జతచేసి చీరెలకు కొత్త అందాలు తెస్తున్నారు. అవే చీరెలు , కానీ చీరె కట్టులో కొత్తదనం ఇవ్వాల్టి ఫ్యాషన్.

Leave a comment