ప్లాస్టిక్ వాడకం వద్దంటూ పెద్దఎత్తున ఉద్యమాలే నడుస్తున్నాయి . నెమ్మదిగా ప్లాస్టిక్ బదులు జనపనార సంచులు గుడ్డ సంచులు వాడటం మొదలైంది . గతంలో వియాత్నంలో ప్యాకింగ్ కోసం ప్లాస్టిక్ ని విపరీతంగా వాడేవాళ్ళు .ఇప్పుడు నెమ్మదిగా ప్లాస్టిక్ పక్కన పెట్టి ,ఆ స్థానంలో అరటి ఆకులూ వాడుతున్నారు . బెండకాయలు,బీన్స్ మాంసం తాజా అరటి ఆకుల్లో చేతి అరటినారతో ప్యాక్ చేస్తున్నారు అలాగే పచ్చని తాటాకులు ,కొబ్బరాకులతో అల్లిన బుట్టలలో వస్తువులు ప్యాక్ చేస్తున్నారు . పర్యావరణ ప్రమాదం కలిగించే ప్లాస్టిక్ ను వాడబోమని సూపర్ మార్కెట్లు చెపుతున్నాయి . మరి మనదేశంలో ఈ పద్ధతి ఎప్పుడు వస్తుందో ఏమో .

Leave a comment