భాషా నైపుణ్యం చాలా అవసరం

పిల్లలకు మాతృభాషా తో పాటు,ఒకటి రెండు ఇతర భాషలను నేర్పగలిగితే ఎక్కువ పదాలను ఉపయోగించ గలిగే నేర్పువస్తుంది అంటున్నారు పరిశోధికులు. చిన్నప్పటి నుంచి కనీసం రెండు భాషలు నేర్చుకొన్న పిల్లల్లో సృజనాత్మకత ఎక్కువగ కనిపించిందని, జ్ఞాపక శక్తి విషయంలో మెరుగ్గ ఉన్నదని చెపుతున్నారు. కొత్త విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నపుడు రెండు భాషాలు వచ్చిన పిల్లలు చాలా తొందరగా స్పదించటం పరిశోధికులు గమనించారు. ఒక అంశాన్ని వివరించే క్రమంలో భాషలపైనా పట్టు ఉన్న పిల్లలు చాలా తొందరగా ఎక్కువ పదాలు వాడేరాని,ఏదైనా కథ చెప్పే సందర్భంలో తమ మనుసులోని భావాలకు తగ్గ పదాలను వేగంగా ఎంచుకొన్నారని పరిశోధికులు వివరించారు. మనసులోని భావాలు అందంగా చెప్పేందుకు అక్షరాలుగా రాసేందుకు మంచి భాష నేర్చుకోవలిసిన అవసరంవుందన్నారు.