లేడి బాడీగార్డ్ దబాంగ్

విదేశీ ప్రతినిదులు ,ప్రముఖులు భద్రత ఇచ్చే పనిలో లేడి బాడీ గార్డ్ గా పేరు తెచ్చుకొంది దబాంగ్ సింగ్ . విద్యార్థులకు,మహిళలకు ఆత్మ రక్షణ విద్యలో తర్ఫీదు కూడా ఇస్తుందామె . సెక్యూరిటీ ఆపీసర్ గా విధుల్లో చేరిన దబాంగ్ సింగ్ మార్షల్ ఆర్ట్స్ ,ఇంకోటి ఆత్మ రక్షణ విధుల్లో తర్ఫీదు పొందింది. బెల్ హెలికాఫ్టర్ ఆమ్ వే ,వెస్ట్రన్ యూనియన్ ,పెయిర్ ఇసాక్ మొదలైన సంస్థలకు రక్షణ సేవలు అందిస్తుంది దబాంగ్ సింగ్ సీన్ గ్రూప్ సర్వీసెస్ సంస్థ . విమెన్ ఎంపవర్ మెంట్ ,సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఫౌండేషన్ పేరుతో ఆమె ఎన్జీఓ నడుపుతున్నారు . ఇతర దేశాలకు కూడా ఈ రక్షణ సంస్థ సేవలందిస్తోంది . వీలైనంత ఎక్కువ మంది స్త్రీలను ఈ రంగంలోకి తీసుకురావటం నా లక్ష్యం అంటుంది దబాంగ్ సింగ్ .