“క్షీరరామలింగేశ్వరుడి ప్రసాదం”

కార్తీక మాసం అందరూ భక్తి శ్రద్ధలతో ఆ లయకారుడికి పూజలు చేసుకుని తరిస్తున్నాము. 

పశ్చిమ గోదావరి జిల్లాలోని  నర్సాపూరం సమీపంలో క్షీరరామలింగేశ్వర స్వామి ఆలయం దర్శించి వద్దాం!! ఇక్కడ స్వామి తెల్లటి పాలరాతితో ఉంటాడు.ఒక బాల భక్తుడు పాల కోసం శివుణ్ణి ప్రార్థించగా త్రిశూలంతో భూమి మీదకి ఛేదించి పాలు ప్రసాదిస్తాడు.శ్రీ రామచంద్ర సీతా సమేతుడై ఇక్కడ శివలింగం ప్రతిష్ఠ చేశారు అని పురాణ గాథలు చెబుతున్నాయి. ఇక్కడ గాలి గోపురం ప్రత్యేక ఆకర్షణ. 125 అడుగులఎత్తు, 9 అంతస్తులతో కలిగింది. దేవతల కోరిక మేరకు శ్రీమహావిష్ణువు లక్ష్మీ దేవీ సమేతుడై జనార్దన మూర్తిగా దర్శనం ఇస్తారు.

నిత్య ప్రసాదం:కొబ్బరి,పండ్లు సమర్పించిన ఆనందంగా కటాక్షం,పాలాభిషేకం.

                -తోలేటి వెంకట శిరీష