ఉదయం వేళ హాడావుడి లేకుండా కొన్ని కూరగాయలు తరిగి ఫ్రిజ్ లో పెట్టుకొంటారు . బంగాళ దుంపలు,ముల్లంగి , క్యారెట్ వంటివి కట్ చేసి ఫ్రిజ్ లో ఉంచితే వాటి టెక్టర్, రంగు కోల్పోతాయి. తేమ అవిరై పొడిబారి దాదాపు రుచి లేకుండా పోతాయి. వీటిని ఫ్రిజ్ లో కట్ చేసి పెట్టాలను కొంటే స్లెసులుగా కట్ చేసి నీరు పోసి మూత కాస్త లూజుగా ఉంచిన పాత్రలో ఉంచుకోవాలి. కాలీఫ్లవర్ ,బ్రకోలీ వంటి పువ్వుల కూరగాయలు కట్ చేస్తే తేమను కోల్పోవు. కానీ ఇవి చాలా సెన్నిటివ్ గా ఫ్రిజ్ లో ఉండే ఇతర పదార్థాల ఫ్లేవర్లను పీల్చుకొంటాయి. ఆకుకూరలు,బాగు చేసి పేడర్ టవల్ లో చుట్టి పెడితే తాజాగా ఉంటాయి.

Leave a comment