కళావతీ దేవి 

కళావతీ దేవి పేరు బహుశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కు చెందిన కళావతి ఆ చుట్టు పక్కల గ్రామాల్లో ఇంటి ఆవరణల్లో మూత్ర శాలలు నిర్మించుకొనేలా చేసింది. గ్రామ ప్రజలకు బహిరంగా మల విసర్జన కారణంగా కలిగే అనారోగ్యాలు గురించి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసిందామె. అల్లుడు చనిపోవటంతో కూతురు,ఇద్దరు మనవళ్ళ పోషణ బాధ్యత ఆమె పైన ఉన్న దాన్ని భారంగా పరిగణించలేదు కళావతి. ప్రజల్లో చైతన్యం నింపి దాదాపు 4000 మూత్ర శాలలు నిర్మించారు ఎంతో కృషి చేసి సాధించింది.