జానపద గేయాలు -వస్తాడని

-డి. సుజాతా దేవి

గుండెల్లో రాగమేదొ
ఉండనీయ దే
నిలువెల్లా తారట్లాడి
నిలవనీయ దే !!

పూలన్నీ ఇరగా బూసి
గాలంతా నాకే ఏసి
పిట్టలు కూసీ కేకేసి
చెట్టులు ఒంగి చెమ్యూచి!!

ఆకాశం వొంగీ వొంగీ
అరిసేతికి అందిందమ్మో
నాకోసం కరిగీ కరిగీ
సినుకల్లే జారిందమ్మో!!

నాగమల్లి పల్లకిలోన
నారాయణ మావొత్తాడు
మొగిలాకూ పందిరికిందా
మూడు ముళ్ళేసేత్తాడు!!