ఇంట్లోనూ వర్కవుట్స్

ఎంత అలవాటయిన వాళ్ళకు అయినా ఈ వేసవి ఎండలకు వర్కవుట్స్ కష్టం అనిపిస్తుంది.ప్రభావ వంతంగా చేయగల కార్డియో వర్కవుట్స్ ఇంట్లోనే చేసుకునే వీలుంటుంది.చిన్ని చిన్ని పరికరాలు సరిపోతాయి.స్కిప్పింగ్ చేయవచ్చు.డీవిడీల సహాయంతో సైడ్ ఏరోబక్స్,నచ్చిన డ్యాన్స్,కిక్ బాక్సింగ్ వర్కవుట్స చేసుకోవచ్చు.ఇవన్ని దృడమైన కార్డియో అంశాలే. మోకాళ్ళ సమస్య లేకపోతే మెట్లెక్కి దిగవచ్చు. ఇది క్యాలరీలను కరిగించగల అద్భుతమైన వ్యాయామం.