అత్యంత స్ఫూర్తి నింపిన సినిమా

72 సంవత్సరాల లతా భగవాన్ కరే గురించిన సినిమా ఇప్పుడు విడుదలైంది . ఫిలిం మేకర్ నవీన్ దేశ్ బోయిన్ మరాఠీ లో ఈ సినిమా నిర్మించారు . అనారోగ్యంతో ఉన్నా భర్తను బ్రతికించుకొనేందుకు మారథాన్ లో పరుగులు తీసింది లతా కరే . ఆ సమయంలో ఆమె భర్త భగవాన్ తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నాడు . మారథాన్ లో గెలిస్తే ఐదువేల రూపాయిలు బహుమతి వస్తుందని తెలుసుకొని నిర్వాహకులను వేడుకోంది లతా . కాళ్ళకు చెప్పులు కూడా లేవు ఈమెకు . వట్టి పాదాలతో కాళ్ళకు రాళ్ళు గుచ్చుకుంటున్నా ,జ్వరంతో శరీరం వశం తప్పుతున్నా పరుగు ఆపకుండా విజేత గా నిలిచి బహుమతి అందుకొంది అప్పుడామె వయసు 65 సంవత్సరాలు ఆ తరువాత వరుసగా మూడేళ్ళ పాటు మారథాన్ విజేత ఈమే .