బంగారపు హోటల్

అద్భుతమైన హోటల్స్ చూసి ఉంటారు . మరి కేవలం బంగారంతో తాపడం చేయించిన హోటల్ చూశారా ?. వియత్నాం లోని హాన్ రివర్,సన్ ట్రా పెనిన్సులా దగ్గర ఉన్న ఈ హోటల్ లో అడుగడుగునా బంగారపు ధగధగలు . స్థానిక హావా బిన్ గ్రీన్ కార్పొరేషన్ ప్రారంభించిన గోల్డెన్ బే హోటల్ మొత్తం బంగారు రంగు థీమ్ తో డిజైన్ చేశారు. ఏదో మాములు గోల్డ్ కలర్ కాదు ,కుర్చీలు,టేబుల్స్ ,బాత్ రూమ్ లో సింక్ లు పంప్ సెట్లు పూర్తిగా బంగారం తో తాపడం చేశారు . విలాసవంతమైన ఈ హోటల్ లో బాత్ టబ్ లు ,కమోడ్ లు సబ్బు పీటలు కూడా బంగారం పూతతో మెరిసిపోతూ ఉంటాయి . డైనింగ్ టేబుల్ పైన స్పూన్లు ,ప్లేట్లు గిన్నెలు స్వర్ణకాంతులతో ధగధగా మెరుస్తూ ఉంటాయి . బంగారు ప్లేట్లో తిని బంగారు కప్పుతో కాఫీ తాగటం గొప్ప అనుభూతే కదా!