పారెస్ట్ బాతింగ్  ….. ప్రకృతి లో స్నానం చేస్తారా ? అవును . అడవిలో మెల్లగా నడుస్తూ ప్రకృతి నుంచి వచ్చే గాలి పీల్చటమే ఈ పారెస్ట్ బాతింగ్ . దాన్ని కనుక్కున్నది జపాన్ వాళ్ళు . ఇలా నడిస్తే ఎన్నో శారీరక ,మానసిక సమస్యలు పరిష్కారం లభిస్తుంది అంటున్నారు . కోపం,ఆందోళన, ఒత్తిడి  అలసట వంటి వాటికీ పారెస్ట్ బాతింగ్ చక్కని పరిష్కారం అంటున్నారు అధ్యయనకారులు దీనికోసం ఎక్కువ శ్రమగా అనిపించని చక్కని అడవి ఎంచుకోవాలి, ఎత్తుపల్లాలు ఉండకూడదు . నాలుగు గంటల పాటైనా పచ్చని చెట్లు నీడన నడుస్తూ ప్రకృతి ఆరాధనలో ,చుట్టూ వినబడే పక్షులు కిలకిలా రావాలతో ,రాలిపడే పూవులతో ,నాదీ ప్రవహపు శబ్దం తో సేదతీరాలి . మహిళలు ఇలా అప్పుడప్పుడు పిక్ నిక్ లాగా అడవిలో విహారానికి వెళ్ళితే పలు ఆరోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం అంటున్నారు పరిశోధకులు . ఒక బ్రేక్ తీసుకోని ప్రకృతి లోకి వెళ్లమంటున్నారు .

Leave a comment