ఈ దీపోత్సవం అందరిదీ

కార్తీక మాసంలో మనదేశం లో దీపాలు వెలిగించి నదిలో వదిలినట్లు వియాత్నం లో శ్రీలంక,నేపాల్ టిబెట్ బంగ్లాదేశ్ ,థాయిలాండ్ మొదలైన దేశాలలో బుద్ద పూర్ణిమగా జరుపుకొంటారు . సంప్రదాయ దుస్తుల్లో స్త్రీలు పడవలెక్కి నదుల్లోకి వెళ్ళి దీపాలను వెలిగించి నీటిలోకి వదులుతారు . దాంతో పాటే పై లోకాల్లో ఉండే పితృదేవతల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తారు . పెద్ద పండగల్లో,పున్నమి రోజుల్లో ఈ దీపాలు వెలిగించటం సంప్రదాయం . బౌద్ధ ధర్మాన్ని ఆచరించే ఈ దేశాలలో ఈ సంప్రదాయాన్ని చాలా నిష్టగా పాటిస్తారు .