దృడత్వం ప్రధానం 

ఫిట్ గ వుండేందుకు సెలబ్రెటీలు అందరు ఆహార నియమాలు పాటిస్తారు. వ్యాయామం వారి దినచర్యలో భాగంగా ఉంటుంది. అయితే అందంగా కనబడటం కంటే దృడంగా ఉండటం చాలా ముఖ్యం అంటోంది సమంత. షూటింగ్ ఉన్న సమయాల్లో కూడా తెల్లవారు జామున లేచి ఐదు గంటలకే జిమ్ కు వెళతాను  కార్డియో, వెయిట్ ట్రెయినింగ్ లేదా షూటింగ్ లో మరీ బిజీ అయితే జాగింగ్ చేస్తాను. ఈ జిమ్ వర్క్ వుట్స్ జాగింగ్ వల్ల శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్ళిపోయి చర్మం కాంతిగా అయిపోతుంది భారతీయ యుద్ధ విద్యల్లో ఒకటైన సిలంబం ను ప్రాక్టీస్ చేస్తాను. సిలంబం వల్ల శరీర దృఢత్వం వస్తుంది ఇది ఆత్మరక్షణకు ఉపయోగ పడుతోంది కూడా . ప్రోటిన్ ఆదారిత పదార్ధాలు తిని కొబ్బరి నీళ్ళు తాగుతాను స్వయంగా అమ్మాయిలు అందరు ఈ ఫిట్ నెస్ కోసం శ్రమ పడాలి అనుకొంటాను అంటోంది సమంత .