పువ్వులెంతో అందం

ఎవరికైనా బహుమతిగా ఇచ్చేందుకు అమరిల్లీస్ మొక్క చాలా బావుంటుంది . పొడవైన ప్రకాశవంతమైన పూలు పూస్తాయి . పద్దెనిమిది నుంచి 30 అంగుళాల పొడవైన కాడతో ఉంటుందీ మొక్క . ఒక్క పూలగుత్తిలో నాలుగు నుంచి ఆరు పువులుంటాయి . తెలుపు ,ఎరుపు ,నారెంజ ,గులాబీ రంగులు విరిసే పూలు ఎంతో అందంగా ఉంటాయి . బార్బడప్ లిల్లీగా పిలిచే ఈ మొక్క ఏడాది పొడవునా పెరుగుతూ అందమైన పూవులు పూస్తుంది . నాణ్యమైన దుంపలు నాటితే సంవత్సరాల తరబడి పూలు పూస్తాయి . మొక్కను తేమగా ఉంచాలి . గాలిలో ఉండే తేమ సరిపోతుంది కానీ పూలు వచ్చాక కాస్త వేడి కావాలి మరీ నేరుగా ఎండపడితే మొక్క వాడిపోతుంది . అందమైన కుండీల్లో ఇంట్లో పెంచుకోవచ్చు .