ఎన్ని దుస్తులున్నా ఎప్పటికప్పుడు కొత్తవి కొనకపోతే నచ్చదు చాలా మందికి . తీరా కొన్నాక అవన్నీ వేసుకొనే సమయం కూడా దొరకదు . అందుకే షాపింగ్ కు వెళ్ళే ముందర ఓ సారి బీరువా ముందు నిలబడి ఉన్నా డ్రస్ లు ,చీరెలు చూడాలి . వాటికీ ఏమైనా మెరుగులు పెడితే అంటే కొత్త బ్లావుజ్ తో ,లేదా కొత్త చున్నీతో కొత్త అందం వస్తుందీ అనుకొంటే ముందాపని  చేయాలి . ప్రతిసారి సందర్భానికి తగ్గట్టు ఒకటి రెండు కొత్త జతలే ఎంచుకోవాలి . ప్రతిసారి ఒక డ్రస్ కాకుండా,మార్కెట్ లోకి వచ్చిన నయాట్రెండ్ ప్రయత్నించాలి . అది నప్పితే కొత్త ప్రయోగం చేసినట్లు అవుతుంది . కొత్త లుక్ సొంతం అవుతుంది . రంగు బావుందనో,మనదగ్గర లేనివో కొనకూడదు . ఖచ్చితంగా మనకి నప్పుతాయి ,వేసుకో బోతున్నాము  అనుకోని నిశ్చయించుకొనే కొనాలి .

Leave a comment