ఆలూ ఫేషియల్

ఖరీదైన ఫేషియల్ పాక్స్ కంటే బంగాళా దుంప రసం ఎంతో బాగా పనిచేస్తుంది అంటారు ఎక్సపర్ట్స్. మొహం పైన మచ్చలు ముడతలు ఉంటే ఈ ఆలూ రసం బాగా ఉపయోగపడుతోంది. బంగాళా దుంప ముక్కలు మిక్సీ లో వేసి రసం పిండి చల్లగా అయ్యేంత వరకు ఫ్రిడ్జ్ లో పట్టాలి. ఈ రసంలో దూది ముంచి ముఖం మొత్తం,మెడ చెవులు కలిపేలా అద్దుకోవాలి. రెండు నిమిషాలు ఆగి కడిగేసుకోవాలి. ఆ తరువాత,నాలుగు స్పూన్ల బంగాళా దుంప రసం ముల్తానీ మట్టి రోజ్ వాటర్ తో కలిపి దాన్ని ముఖానికి పట్టించి అరగంట అలా వదిలేసి ముఖం కడుక్కుంటే మొహం చక్కగా వుంటుంది.