కౌగిలి ఇచ్చే శక్తి 

పుట్టిన కొన్ని రోజులకే పసివాళ్ళు అమ్మానాన్నల కౌగిలింతను గుర్తుపట్టేస్తారట. ఈ పసిబిడ్డలకు తల్లిదండ్రులు  గుండెలకు హత్తుకొనీ  దానికీ,బయట వాళ్ళు దగ్గరకు తీసిన దానికీ తేడా తెలిసిపోతుందనీ టోక్యో లోని యోషిడా ఆఫ్  టోహా యూనివర్సిటీ నిపుణుల బృందం చేసిన పరిశోధనలో తేలింది. ఏడాది లోపు వేల  కొద్ది పిల్లలను ఎంపిక చేసి  చేసిన పరిశోధనలు పిల్లలను తల్లిదండ్రులు హత్తుకుంటే వారిలో గుండె కొట్టుకునే వేగం తగ్గిందట. అంటే పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా ఈ కౌగిలింతలో రిలాక్స్ అయ్యారట బయట వాళ్లు ఎత్తుకుంటే పసిపిల్లల గుండె కొట్టుకునే వేగం లో మార్పేమీ లేదు. ఈ కౌగిలి వల్ల పిల్లల్లో ఎంతో స్వాంతన కలుగుతోందని వారి పెరుగుదలతో ఈ భద్రతా భావం వారిలో ఎంతో శక్తి సామర్థ్యాలు పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.