ప్రతిభకు పట్టాభిషేకం

అందరి జీవితాలు వడ్డించిన విస్తరి వంటివి కాదు . జీవితంలో ఎదగాలంటే కన్నీటి సముద్రాలు ఈదాలి . మూళ్ళ బాటలో నడవాలి . ఆ మాటే చెపుతోంది ఐశ్వర్యా రాజేష్ . టెడెక్స్ వేదిక పైన ఆమె మాట్లాడిన మాటలు 16 లక్షల మంది చూశారు .సామజిక మాధ్యమాల్లో లక్షల మంది షేర్ చేసుకొన్నారు . నటుడు రాజేష్ కూతురై ఐశ్వర్య . తండ్రి మరణం తో నలుగురు పిల్లల్ని రాజేష్ భార్యే పెంచి పెద్ద చేసింది . ఐశ్వర్య  రక్తం లోనే నటన ఉంది బుల్లి తెర సీరియల్స్ అడుగు పెట్టింది . ఎక్కడకు వెళ్ళినా తిరస్కరాలే రంగు తక్కువని చిన్నచూపే ఎన్నో అవమానాల నుంచి గట్టెక్కింది . ప్రతిభకే స్థానం ఉందని నిరూపించుకొంది . మా అమ్మ ఎంతో కష్టపడింది . డబ్బు కోసం నేను ఓ సూపర్ మార్కెట్ లో  పని చేసేదాన్ని మధ్యలో రెండేళ్ళ వ్యవధి లో నా సోదరులు ఇద్దరు మరణించారు . ఇది మా కుటుంబానికి ఇంకో దెబ్బ ఈ వేదిక పైన నేను చెప్పిన నా జీవిత కథ ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తి కావాలని ,ఎప్పటికైనా మనలో టాలెంట్ మనల్ని వృద్ధిలోకి తీసుకు వెళుతుందని అంటోంది ఐశ్వర్య .