“మార్తాండ భైరవుడి ప్రసాదం”

 కర్నాటక రాష్ట్రంలోని మాంగ్ సులి సమీపంలో ఖండోబా ఆలయంలో మనం మార్తాండ భైరవుడిని చూసి దర్శనం చేసుకోవచ్చు.

మల్ల మరియు మణి అనే రాక్షసులు వారికి మరణం లేకుండా ఎవరితోటి ఓటమి లేకుండా వరమివ్వమని బ్రహ్మదేవుని కోసం తపస్సు చేసి వరము పొందారు.వారివురు గర్వంతో దేవతలను,మునీశ్వరులను హింసించేవారు.ఆ బాధలు భరించలేక శివుని ధ్యానం చేస్తూ వుంటే  శివుని అంశంగా మూడు కన్నులతో బంగారు రంగు ముఖముతో ఫాలభాగాన నెలవంక తో ఉద్భవించిన మార్తాండ భైరవుడిని చూసి అందరూ సంతసంచి రాక్షసులను సంహరించమని వేడుకున్నారు.ఈ ఆలయంలో మణి అనే రాక్షసుడి విగ్రహం కూడా వుంది.ఇక్కడికి ముస్లిం, సిక్కూ,జైన భక్తులు వచ్చి స్వామి వారిని చూచి తరిస్తారు.

నిత్యప్రసాదం: కొబ్బరి, అభిషేకం
   
            -తోలేటి వెంకట శిరీష