ఖస్‌ సిరప్‌ 

ఆయుర్వేద ఔషదాలలో ఎక్కువగా వినియోగించే ఒట్టి వేర్లను ఉసిరి ఖస్‌ నన్నారీ  అని కూడా పిలుస్తారు వీటి నుంచి తీసే తైలం చలువ చేస్తుంది జ్వరం తగ్గిస్తుంది.ఈ వేర్లతో కషాయం,షర్బత్ చేసుకోవచ్చు వీటిలో ఇనుము,మాంగనీస్ విటమిన్ బి6 సి పుష్కలంగా ఉంటాయి ఖస్‌ సిరప్‌ ఇంట్లో కూడా చేసుకోవచ్చు.వట్టి వేర్లు 40 గ్రాములు నీళ్లు ఐదు కప్పులు తాటి బెల్లం లేదా పటిక బెల్లం 300 గ్రాములు నిమ్మకాయలు-2 తీసుకోవాలి వట్టివేర్లు శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా చేసుకొని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి ఉదయం మిక్సీలో వేసి గ్రైండ్ చేసి వచ్చిన రసం వడకట్టి వేడి చేయాలి.బెల్లం పాకం పట్టి, దానిలో ఈ వేడి చేసిన రసం వడపోసి పొయ్యాలి చివరగా నిమ్మ రసం పోయాలి. ఈ ఖస్‌ సిరప్ నెల రోజులు నిల్వ ఉంటుంది.