షాపింగ్ కు వెళ్తున్నారా ? 

లాక్ డౌన్ సడలిస్తున్నారు .సూపర్ మార్కెట్స్, కిరాణా దుకాణాలు తెరచుకున్నాయి కొన్ని జాగ్రత్తలు తీసుకొని షాపింగ్ కి వెళ్ళండి అంటున్నారు. వీలైనంత వరకు ఉదయం వేళ షాపింగ్ చేయాలి.తక్కువ మంది ఉంటారు కనుక త్వరగా బయటపడవచ్చు.  వెళ్ళే ముందర పాకెట్ హ్యాండ్ శానిటైజర్ వెంట తీసుకుపోవాలి. స్టోర్ లో తోటి కస్టమర్లకు ఆరు అడుగుల దూరంలో ఉండాలి. నోరు,ముక్కు కవర్ చేసేలా మాస్క్ ధరించాలి. ముఖం ముట్టుకోవద్దు డిస్ ఇన్ఫెక్ట్ వస్త్రంతో చేతులు తరచూ తుడుచుకోవాలి.  వీలైనంతవరకు ఆన్  లైన్ లో డబ్బులు చెల్లించేలా అలవాటు చేసుకోవాలి డెబిట్,క్రెడిట్ కార్డులతో బిల్లు చెల్లించక శానిటైజర్ తో చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. ఇంటికి రాగానే వస్తువులు పక్కన ఉంచి చేతులు సబ్బుతో కడుక్కోవాలి.