ఎప్పటికీ  మారని ఫ్యాషన్

ఎలాంటి వస్త్రధారణ కైనా మీనాకారి నగలు చక్కగా మ్యాచ్ అవుతాయి . రాజస్థానీ మూలాలు గల ఈ నగలు పర్షియా నుంచి వచ్చాయి . మీనాకారి వర్క్ చాలా సున్నితమైంది . ఆకులూ ,పువ్వులో ,పక్షులు మొదలైన డిజైన్ లను  చక్కని మెరిసే రంగులతో వివిధ మెటల్స్ డిజైన్ లను చక్కని మెరిసే రంగులతో వివిధ మెటల్స్ పైన పెయింటింగ్ చేసి ఈ నగల్ని తయారు చేస్తారు . ఈ పనితనం కళ్ళు చెదిరేలా ఉంటుంది . ముందుగా కావలసిన డిజైన్ ను లోహం పై చెక్కి రంగులు అద్దుతారు . నిండు రంగుల ఎనామిల్ డస్ట్ ను చెక్కిన డిజైన్ లో నింపుతారు . మొదట్లో మొఘల్ చక్రవర్తులు భవనాల అలంకరణలో ఈ మీనాకారి ఆర్ట్ ప్రవేశపెట్టారు . నెమ్మదిగా ఈ పనితనం ఆభరణాలలోకి వచ్చింది . ఇవి అందానికి ప్రతిరూపం . తిరుగులేని ఫ్యాషన్ ట్రెండ్ .