వైకల్యం అడ్డుకాదు: మోడీ

అనుష్క పాండే ఆల్ ఇండియా టాపర్  గా నిలవటానికి వైకల్యం అడ్డంకి కాలేదు అన్నారు ప్రధాని నరేంద్ర  మోడీ మన్ కీ బాత్ లో.. మోడీ ప్రశంసలు పొందిన గురు గ్రామ్ కి చెందిన అనుష్క పాండే పదోతరగతి (సి బి ఎస్ ఈ ) లో 500 కు గాను 489 మార్కులు సాధించింది.  ప్రత్యేక విభాగంలో మొదటి స్థానంలో నిలబడింది. అనుష్క స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ  అనే  జన్యు సంబంధమైన వ్యాధితో బాధపడుతూ చిన్నతనం నుంచి చక్రాల కుర్చీకే పరిమితం అయ్యింది.దివ్యాంగులు నన్ను చూసి స్ఫూర్తి పొందాలి.నేను ఎంతో సేపు కూర్చోలేను స్కూల్ యాజమాన్యం నా కోసం నా అవసరాలకు తగ్గట్లు కూర్చునేందుకు బెంచీ తయారు చేశారు. ప్రధాని నా పేరు ప్రస్తావించినందుకు నాకెంతో సంతోషం కలిగింది అంటోంది అనుష్క పాండే.