ప్రపంచవ్యాప్త గుర్తింపు

జేమ్స్ బాండ్ సినిమాకు థీమ్ సాంగ్ పాడే అవకాశం 18 ఏళ్ల అమెరికా అమ్మాయి బిల్లీ ఐలిష్ దక్కించుకుంది.బిల్లీ ఐలిష్ ఈ నో టైమ్‌ టు డై పాట రాబోతున్న సినిమా కంటే  పాపులర్ అయింది. ఈ పాట పాడిన సింగర్ 2019లో వెన్‌ వీ ఆల్‌ ఫాల్‌ ఎస్లీప్‌ అనే తొలి ఆల్బమ్ తో అమెరికా ఇంగ్లాండ్ లో సింగర్ గా వెలుగులోకి వచ్చింది. వరుసగా ఐదు గ్రామీ అవార్డులు ,రెండు అమెరికన్ మ్యూజిక్ అవార్డ్ లు రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లు మూడు ఎమ్‌టీవీ వీడియో మ్యూజిక్‌ అవార్డులు కూడా గెలుచుకుంది. 2019లో బెస్ట్‌ న్యూ ఆర్టిస్ట్‌ రికార్డ్ ఆఫ్ ది ఇయర్, ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ గ్రామీ అవార్డులు ఒకేసారి గెలుచుకున్న అతి  పిన్న వయస్కురాలు కూడా బిల్లీ ఐలిష్ నే.