ఎంత కష్టమైనా సరే ,హెవీ వెయిట్స్ మోసైనా సరే బరువు తగ్గిపోదాం అని ఉత్సాహపడతారు అమ్మాయిలు . కానీ ఈ పిట్ నెస్ ప్లాన్ ముందులోనే దెబ్బతీస్తూ ఉంటుంది . శారీరక అలసట లక్ష్యాన్ని దెబ్బతీస్తుంది . అయితే వ్యాయామం చేస్తూ సంగీతం వింటే మూడ్ బావుండి అలసట తెలియదు అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . సంగీతం శారీరక అలసట నుంచి దృష్టి మరల్చి పూర్తి స్థాయి పద పార్మెన్స్ 15 శాతం పెంచుతుందని అధ్యయనాలు గుర్తించాయి . సంగీతం నొప్పులపైకి దృష్టి పోనివ్వదు . స్థిరంగా వర్కవుట్స్ సాగేందుకు సహకరిస్తుంది . హై చీట్స్ ,పాస్ట్ టెంపోరకం మరింత ప్రభావం చూపిస్తాయి అంటారు అధ్యయనకారులు . హై ఇంటెన్సిటీ వర్కవుట్స్ కు రాక్ మ్యూజిక్ ,నెమ్మది నుంచి మోడరేట్ వ్యాయామాలకు పాప్ మ్యూజిక్ ,జాగర్లకు హిప్ హప్ బాగా సూటవుతాయని అధ్యయన కారులు చెపుతున్నారు .

Leave a comment