మట్టి లేకుండానే నీళ్ళతో మొక్కలు పెంచవచ్చని 16వ శతాబ్దంలోనే శాస్త్రవేత్తలు నిరూపించారు. ఈ పరిశోధన ఇప్పుడు ఫలవంతమై కనిపిస్తోంది. ఈ విధానాన్ని హైడ్రోపోనిక్స్ అంటారు. ఇలా పంటలు పండించేందుకు ఎకరాల లెక్కన పొలం అక్కర్లేదు. నేల మంచిది కాకపోయినా పర్లేదు. కలుపు మొక్కల బాధ లేదు. చీడ పీడలు ఆశించవు. ఆస్ట్రేలియా ,అమెరికా ,న్యూజిలాండ్ ,ఇజ్రాయిల్ మొదలైన దేశాల్లో రైతులు ఈ తోటలు సాగుచేస్తున్నారు. ఈ స్ఫూర్తిలో ఎంత మంది విధ్యావంతులు హైడ్రోఫోనిక్స్ విధానంతో కూరగాయాలు పండిస్తున్నారు. నీటి గొట్టాలకు రంధ్రాలకు చేసి వాటిలో చిన్న కప్పులు అమర్చి వాటిలో మొక్కలు నాటుతారు. మొక్కల వేళ్ళు కప్పుల రంధ్రాల లోంచి పైపుల్లోకి వెళతాయి. పైపుల్లో పోషకాలతో అమర్చిన నీళ్ళు ప్రవహాస్తూ ఉంటాయి. ఈ నీళ్ళతో మొక్కలు పెరిగిపెద్దవవుతాయి.

Leave a comment