చదువుకొని ఉద్యోగాలు సంపాదించి పల్లెల్ని వదిలేసి పట్టణాలకు తరలి పోతుంది యువత. పల్లెలు నిర్మానుష్యం అవుతున్నాయి స్విజర్లాండ్ లోని కోరిప్పా గ్రామం కధ ఇదే. అందరు పట్టణాలకు వెళ్ళి పోవటంతో ఆగ్రామంలో మేయర్ తో కలిపి మొత్తం 12 మందే ఉన్నారు. వాళ్ళు 70 ఏళ్ళ పై బడిన వారే పెన్షన్ తో జీవించే వారే. అందుకే భవిష్యత్ లో ఆగ్రామం పాడుబడిపోకుండా ఉండాలని ఓ సంస్థ వినూత్మమైన ఆలోచనతో ముందుకు వచ్చింది. మొత్తం ఆగ్రామాన్ని ఒక హోటల్ గా,రిసార్ట్ గా మార్చేయాలనుకొంది . ఈ ప్రాజెక్ట్ ను అల్ బెర్గో కోరిప్పో అంటున్నారు. మొత్తాంగా ఊరంతా ఒక హోటల్ అయిపోయింది అసలే అందమైన ఊరు ఇది. పూర్తిగా టూరిస్ట్ ప్లేస్ అయిపోనున్నది.

Leave a comment