వాళ్ళని ఆడనివ్వండి

పిల్లలు ఆటలు ఆడుతుంటే ఆరోగ్యం అనే సంగతి తేలిసిందే కాని ఒకటో తరగతి పిల్లలకు అంతులేని సిలబస్, బరువుతో ఆటలు ఆడే సమయం తగ్గిపోతుంది అని నార్వే యూనవర్సిటి ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజి సంబంధించిన పరిశోధకులు 800 పైగా చేసిన సర్వేలో ఆటలు ఆడే పిల్లలో మానసిక సమస్యలు లేకుండా ఉల్లాసంగా ఉన్నారు అని తేల్చారు. పరుగులు పెడుతు చెమటలు కక్కేలా ఆటలు ఆడితే డిప్రెషన్ లు కనిపించడం లేదు అంటా . కోపం, విసుగు, అల్లరి , అతి మాములు స్థాయిలోనే ఉన్నాయి అని వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు అని తేలింది. కాసేపు పిల్లలని ఆడుకోనివ్వండి అంటున్నారు పరిశోధకులు. నాలుగు గోడల వాతవరణంలో పెద్ద వాళ్ళలాగా పిల్లలు బరువే లోకంగా చదువే లోకంగా ఉండలేరని చేబుతున్నారు.