ఏడడుగులబంధం కోసం ఆచితూచి అడుగులేస్తున్నారు అమ్మాయిలు. తన చేయి పట్టుకుని జీవితాంతం తోడుగా నిలబడే వ్యక్తి వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇస్తున్నారని విద్యావంతులైన మగవాళ్లనే పెళ్లాడేందుకు ఇష్టపడుతున్నారని ఒక మ్యారేజ్ వెబ్సైట్ సర్వేలో తేలింది. ఇందులో 6000 మంది వినియోగదారులు అభిప్రాయాలూ తీసుకున్నారు. ఆడపిల్లల అభిప్రాయాలను తీసుకుంటే ప్రతి ఇద్దరు ఆడపిల్లల్లో ఒకళ్ళు ఉమ్మడి కుటుంబాలకు చెందిన మగవాళ్ళని పెళ్లాడేందుకు ఇష్టపడుతున్నారు. 60 శాతం మంది అమ్మాయిలకు కులం గురించి పట్టింపే లేదు. ప్రతి పదిమంది ఆడపిల్లల్లో ఆరుగురు యువతులు చూడచక్కని వాళ్ళని ఎంచుకోకుండా వాళ్లే ప్రొఫైల్స్ చూస్తున్నారు. 40 శాతం మంది అమ్మాయిలు వాళ్ళ జీవిత భాగస్వాములను వాళ్లే ఎన్నుకుంటున్నారు. తమ గురించి చెప్పటంలో ఎదుటివాళ్ళ గురించి తెలుసుకోవడంలో అమ్మాయిలే మాట కలుపుతున్నారు. ముఖ్యమైన మాట 85 శాతం మహిళలు కనీసం బ్యాచిలర్ డిగ్రీ అన్నా ఉంటే తప్ప డబ్బు రూపం వున్నా వద్దులే అంటున్నారు.
Categories
You&Me

విద్యావంతులైతేనే సరే అంటున్నారు

Leave a comment