వేసవిలో చల్లగా

ఎండవేడి పెరుగుతున్న కొద్ది ఫ్యాషన్ పోకడ మారిపోతుంది. ఈ రోజుల్లో యాక్సిసరీలు కేవలం ట్రెండీగానే కాదు సౌకర్యంగాను ఉండాలి. ఈ కాలంలో మెటల్ జ్యూలరీ వాడకపోవడం మంచిది.స్టోన్ ,బీడ్స్ ,సిల్క్ థ్రెడ్ తో తయారు చేసిన టూజల్ జ్యూలరీ మంచివి.గాజులు,బ్రాస్ లెట్స్ చక్కగా ఉంటాయి.హాండ్ బ్యాగ్స్ ఐతే వస్త్రంతో తయారు చేసిన పౌచ్ లు జ్యూట్ త్రెడ్ లెస్ లో తయారు చేసిన హ్యాండ్ బ్యాగ్స్ బావుంటాయి. అలాగే ఎలాంటి డ్రెస్ పైన అయినా ఎండ నుంచి రక్షణగా ఉండేలా గళ్ళు గీతలు ప్రింట్ తో ఉండే స్కార్ఫ్ వేసుకుంటే మంచిది. చక్కని నాణ్యమైన సన్ గ్లాస్ తో కాటన్ వస్త్రశ్రేణి ఈ వేసవికి తప్పని సరి.