45 ఏళ్ళ వయసు దాటాక వారు నడుస్తున్న వేగాన్ని బట్టి వారి మానసిక వయస్సుని అంచనా వేయచ్చు అంటున్నారు అధ్యయన కారులు . ఇటీవల జరిగిన ఈ అధ్యయనంలో 45 ఏళ్ల వయసులోని వెయ్యిమందిని తీసుకోని వారి జీవన శైలిని అధ్యయనం చేశారు . వాళ్ళలో చురుకుగా నడిచే వారి మెదడు చురుకుగా ఉందని గుర్తించారు . వారి ఎమ్మారై స్కాన్ లో నెమ్మదిగా నడిచే వాళ్ళ మెదడు పరిమాణం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు . రక్తనాళాల్లోనూ తేడా కనిపించారు . నెమ్మదిగా నడిచే వాళ్ళ మొహంలోనూ వృద్ధాప్య ఛాయలు కనిపించాయట . ఎవరైనా 40 దాటిన వయస్సులో నడక వేగం మందగిస్తే వెంటనే డాక్టర్స్ ను కలుసుకోమంటున్నారు .

Leave a comment