“వాసవీ కన్యాకాపరమేశ్వరి ప్రసాదం”

సుమంగళి మణులకు శుక్రవారపు సుమాలు అందుకోండి !

పశ్చిమ గోదావరిజిల్లా పెనుగొండ క్షేత్రంలో వెలసిన శ్రీ వాసవీ కన్యాకాపరమేశ్వరి ప్రసాదం స్వీకరించి వద్దాం పదండి.

చోళ వంశపు రాజు కన్యాకాపరమేశ్వరిని వివాహం చేసుకుంటానని వినిన ఆ తల్లి మనసు అంగీకరించక తనను తానే ఆత్మ పరిత్యాగం చేసుకుంది. ఆర్య,వైశ్యులకు కన్యాకాపరమేశ్వరి కులదైవంగా ఆరాధన చేస్తూ అమ్మవారి కటాక్షం పొందుతారు.
ఇక్కడ ప్రతి ఉత్సవం ఎంతో వైభవంగా జరుపుకుంటారు.

నిత్య ప్రసాదం: కొబ్బరి, పండ్లు,పాయసం

-తోలేటి వెంకట శిరీష