వాళ్ళని సోషల్ మీడియాకు దూరం పెడతా

అస్తమానం సోషల్ మీడియా యాప్స్ తో గడిపే యువత రియల్ లైఫ్ కు దూరమై డిప్రెషన్ కు గురయ్యే ప్రమాదం ఉందని చెపుతోంది బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్. యాత్ సోషల్ మీడియాకు ఎడిక్ట్ అవుతున్నారు దీని ప్రభావం వారి మానసిక, ఆరోగ్యంపై పడుతుంది. పూర్తిగా అకౌంట్ డిలీట్ చేయమని నేను చెప్పను గాని ఎక్కువ టైమ్ ఇవ్వద్దని మాత్రం చెపుతాను అంటోంది కత్రినా. యువత వారి సమయాన్ని వారి లక్ష్య సాధాన కోసం వినియోగించాలని అప్పుడే వారి జీవితం బాగుటుందని నా అభిప్రాయం. భవిష్యత్ లో నా పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఫిజికల్ యాక్టివిటీష్ కు దగ్గరగా ఉండేలా పెంచుతాను అంటోంది కత్రినా.