చలికాలంలో జుట్టు పొడిబారిపోతే సహజ నూనెలతో మసాజ్ మంచిది అంటున్నారు ఎక్సపర్ట్స్ బ్రహ్మ,గుంటగలగారాకు,యస్టీ వంటి మూలికలతో తయారైన నూనెలు ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయి. నువ్వుల నూనెలో గానీ కొబ్బరి నూనెలో కానీ ఈ ఆయుర్వేద నూనెలు కలిపి తలకు అప్లై చేసి నెమ్మదిగా మసాజ్ చేసి. ఓ గంట ఆగి తలస్నానం చేయాలి. అలాగే మందార,గురువింద వేప నూనెతో తయారైన నూనెలు మంచివే. అలాగే ఉసిరి జుట్టు రాలటాన్ని అరికట్టి ఆరోగ్యంగా ఉంచుతోంది. శీత కాలంలో ఉసిరికాయలు ఎక్కువగా దొరుకుతాయి. ఉసిరి రసాన్ని కొబ్బరి నూనెలో వేసి కాచిన నూనెతో జుట్టు కు మసాజ్ చేస్తే జుట్టు తెగిపోవటం ఊడిపోవటం తగ్గి ఆరోగ్యంగా ఉంటాయి.

Leave a comment