ఆకాశం అంతే నిర్మాణాలలో పచ్చని చెట్లే కరువైపోయి చిన్ని పిచ్చుకలు ,పావురాళ్ళు కు చోటే లేకుండా పోయింది . చెట్లే లేనిచోట కోయిల పాటలు ,పిచ్చుకల చిరునామాలు ఎక్కడుంటాయి . కర్ణాటకలోని బీదర్ లో ఇద్దరు యువకుల కృషి ఫలితంగా ఆ ప్రాంతం పక్షుల కిలకిలా రాగాలలో కళకళలాడుతోంది . వినాయక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ . బీదర్ ఫాలో గ్రాఫిక్ సొసైటీ మెంబర్ . చుట్టూ పక్షుల సంఖ్య తగ్గిపోవటం గమనించి ఇంటి చుట్టూ పక్కల గింజలు ,తాగే నీళ్ళు చిన్ని గిన్నెలో ఏర్పాటు చేయటం మొదలు పెట్టాడు . అదే ఊర్లోని ఇంజనీరింగ్ చదివిన సాయినాధ్  శర్మ కూడా తాను గార్డెన్ లో పక్షుల ఆహారం,నీళ్ళు ఉంచాడు . నెమ్మదిగా ఈ కాన్సెప్ట్ ఊరంతా పాకింది . ఇప్పుడు బీదర్ ఊరంతా పక్షులే .

Leave a comment