తిరుగు లేని రుచి

మినపప్పు,బియ్యం కలిపి రుబ్బి వేసే దోశల మూలాలు దక్షిణాదివి, కానీ దేశం మొత్తం మీద వేల రకాల దోశలు తయారవుతాయి. మైసూర్ ఫుడ్ స్ట్రీట్ నిండా దోశల రకాలే, లోపల ఎండు మిరప వేసి అద్దితే అది మైసూర్ దోశే. అలాగే తమిళనాడులో ప్రతి రెండు రెస్టారెంట్లలో ఒక దానిలో రకరకాల దోశలు దొరుకుతాయి.ముంబై వాసులకు దోశలు అంటే ఇష్టం. మెరైన్ లైన్స్ లో పాపులర్ బాబునాథ్ దోశె సెంటర్ దోశలకు రుచులకు ప్రసిద్ది. కర్నాటకలో షిమోగా జాగ్ పాల్స్ ఎంత ప్రసిద్ది చెందాయో స్పెషల్ మసాల దోశలు అంటే ప్రసిద్ది. ఉల్లి,పచ్చి మిర్చి ముక్కలు కలిపి వేసే మసాల దోశె చీజ్ పొటాటో దోశె ఉల్లి దోశె ఇవన్ని దక్షిణాది స్పెషల్ దోశలే.