హిందూ ధర్మం ప్రకారం హిందువులకు ఈ రోజు నుంచి పండుగలు మొదలు.ఈ తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని పిలుస్తారు.విష్ణు మూర్తి ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు నిద్రావస్ధలో విశ్రమిస్తారు.దీనినే చాతుర్మాస దీక్ష అంటారు….

కృత యుగంలో మురాసురుడు అనే రాక్షసుడు కిరాతక చర్యలతో అల్లకల్లోలం సృష్టించాడు.విష్ణు మూర్తి వేయ్యేళ్లు యుద్ధం చేసి సంహరించి ఒక గుహలో అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆయన శరీరంలో నుంచి ఒక కన్య జన్మించి ఆ రాక్షసుడిని హతమార్చింది.విష్ణు మూర్తి సంతోషించి వరం కోరుకోమనడం,విష్ణుప్రియగా ఈనాడు తలచుకుని పూజలు చేస్తారు.
ఈ రోజుని పేలాల పండుగ అని కూడా అంటారు. పాతావరణ మార్పులు రావటం వలన పేలాల పిండి తింటే ఆరోగ్యం నిలకడగా వుంటుంది.
ఇష్టమైన రంగుల: పసుపు.
ఇష్టమైన పూలు: అన్ని రకాల పుష్పాలు అంగీకారం.
నిత్య ప్రసాదం:కొబ్బరి,పండ్లు, పేలప్పిండి.
తయారీ విధానం: బట్టి లో స్వచ్ఛమైన పేలాలను తీసుకుని తగినంత బెల్లం వేసి తొక్కి విష్ణు మూర్తికి నైవేద్యం పెట్టి మనం కూడా ప్రసాదం తినటమే.

-తోలేటి వెంకట శిరీష

Leave a comment