ఈ హారానికి ఆదరణ 

రాముడిని మించిన దైవం లేదంటారు రామ భక్తులు. రాముని చెంత చల్లని కళ్ళతో ఆశీర్వదించే సీతామాత..వాళ్ళని కొలుస్తూ ఆంజనేయుడు ఒక అలవాటైన అపురూపమైన దృశ్యం. ఈ ముగ్గురితో పాటు లక్ష్మణుడు కూడా ఈ అందమైన హారాల్లో కొలువుదీరి కనిపిస్తాడు. ఈ మధ్య కాలంలో విశేషమైన ఆదరణ పొందిన హారాల్లో ఈ రామ పరివారపు హారం ఒకటి. రత్నాలు,పచ్చలు ఖరీదైన వజ్రాలతో మలిచిన ఈ హారానికి. రామ లక్ష్మణ సీత,హనుమంతుల లాకెట్ ప్రత్యేక ఆకర్షణ. రాళ్ళూ కూర్చిన చిన్న కేసులపై రాముడు కొలువు దిరినట్లు చెక్కిన ఈ హారం ఎంతో అందంగా,ఉంది.