బంగారంతో పోలిస్తే రోజ్ గోల్డ్ కాస్త ఖరీదు తక్కువే . భారీ జ్యువెలరీ ధరించాలి అనుకొంటే  రోజ్ గోల్డ్ జ్యువెలరీ ఎంచుకోవచ్చు . చెవులకు పెద్ద రింగులు భారీగా ఉండే ఆభరణాలు లేటెస్ట్ ఫ్యాషన్ . రోజ్ గోల్డ్ తో తయారైన ప్లెయిన్ రింగ్స్ కూడాసైజ్ జూకాలతో కలిసి ధరిస్తే బావుంటుంది  అందమే . రోజ్ గోల్డ్ స్టడ్ ఇయర్ రింగ్స్ ను భారీ సైజ్ జూకాలతో కలిపి ధరిస్తే బావుంటుంది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . రెండు బంగారు గాజులు లేదా వెండి గాజులు మధ్య రోజ్ గోల్డ్ తో తయారైన గాజులు చక్కగా ఇమిడిపోతాయి . వైట్ గోల్డ్ కూడా తాజా ట్రెండ్ కనుక రోజ్ అండ్ వైట్ గోల్డ్ కలిపి లేయర్డ్ జ్యువెలరీ గా వాడచ్చు . ఈ బంగారంతో తయారైన ఏ ఆభరణమైనా అదునికత ఉట్టిపడుతూ రెండింతల ఆకర్షణతో ఉంటుంది .

Leave a comment