ఇదంతా నేను ఒక్క రోజులో సాధించింది కానేకాదు . ఏడాదిన్నర పాటు జిమ్ లో కష్టపడ్డాను . 96 కిలోల బరువును నెమ్మదిగానే తగ్గించుకొంటేనే ఆరోగ్యమని చెప్పిన ఎక్స్ పర్డ్స్ సలహా అక్షరాలా పాటించాను అంటోంది సారా అలీఖాన్ .మొదటి రోజు నేను చాల బొద్దుగా ఉన్నా సమయంలో జిమ్ లో వెయిట్ బాల్ పట్టుకొని క్రంటిస్ మొదలు పెట్టాను . అయితే మూడు కూడా చేయిలేకపోయాను . అంతకు మించి చేయటం అసాధ్యం అనిపించింది . కానీ ఎంత పట్టుదలగా ఉన్నానంటే నేను తగ్గించు కోదలుచుకొన్నా బరువు నా ఎదురుగ్గా కళ్ళముందు నిలుపుకొన్నాను . ఇక ప్రయత్నించటం మొదలు పెట్టారు . ఇప్పుడు నేను క్రాంచ్ ఛాలెంజ్ కు కూడా సిద్ధంగా ఉన్నాను అంటోంది సారా అలీఖాన్. బరువు తగ్గాలను కొన్నా వాళ్ళకి ఈ మాటలో స్ఫూర్తి ఆచరణీయం కూడా .

Leave a comment