నిర్ణయాలన్నీ నావే

సినిమా రంగం పూర్తిగా పురుషులకే సొంతమైన ప్రదేశం అయితే  నా వరకు నేనెప్పుడూ ఎవరి జోక్యన్నీ సహించలేను . నా ఇష్టానికే నా కథలు ఎంపిక చేసుకుంటాను . కథ నచ్చకపోతే సినిమా చేయను . ఎలాంటి మొహమాటాలకు చోటివ్వను అంటోంది నయనతార . ఈ రంగంలో కి వచ్చాక కొద్ది కాలానికే నేనొ నిర్ణయం తీసుకొన్నాను . షూటింగ్స్,కాస్ట్యూమ్స్ ,మేకప్ విషయంలో నిర్ణయం నాదే . నాకెంత దగ్గర వాళ్ళయినా జోక్యం చేసుకొంటే వప్పుకోను . నేను నటించిన సినిమా సక్సెస్ అయిన పెయిల్ అయిన నా చర్యలే . ఈ సినిమా నన్ను సూపర్ స్టార్ ని చేసింది . దాన్ని నేను నిరంతరం నిలబెట్టు కోవాలి ప్రస్తుతం నేను చేస్తున్న పని అదే . అవసరానికి మించి గ్లామర్ గా కనిపించటం కూడా నాకు ఇష్టం లేదు . గ్లామర్ పేరుతో అసభ్యతను నేనసలు సహించను అంటోంది నయనతార .